భాజపాతోనే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు సాధ్యం: గుజ్జుల రామకృష్ణారెడ్డి

జమ్మికుంట గ్రామీణం: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు భాజపాతోనే సాధ్యమని రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణరెడ్డి పేర్కొన్నారు. జమ్మికుంట మండలం బోగంపాడు గ్రామంలో ఈ రోజు ఆయన పార్టీ పతాకాన్ని అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌, తెదేపా, తెరాస పార్టీలలో కుటుంబ పాలన నాయకత్వం సాగుతుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సమావేశంలో జిల్లా భాజపా అధ్యక్షుడు మీషా అర్జునరావు, కిసాన్‌మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. రాజిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణా రెడ్డి, శ్రీరాంరెడ్డి , సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు