భాజపాపై సోనియా విసుర్లు

బాడ్మేర్‌ (రాజస్థాన్‌): యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ భాజపాపై దూకుడు మరింత పెంచారు. పార్లమెంట్‌ కార్యకలాపాలను స్తంభింపచేయడానికి వారు ప్రస్తావిస్తున్న అంశాలపై చర్చకు రావలని గురువారం సవాల్‌ చేశారు. తాగునీటి పథం ప్రారోంభత్సవానికి హాజరైన సోనియీ ఇక్కడ నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతూ ”ప్రపంచ ఆర్థిక మందగమనం ఎంతో కొంత మనపై ప్రభావం చూపుతోంది. దీంతో పాటు ద్రవ్యోల్బణం, కరవు, వరదలు, సామాజిక ఉద్రిక్తతలు వంటి సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించడానికి మనం పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తూ పరస్పరం దన్నుగా నిలవాలి. కానీ కొంత మంది ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తే పార్లమెంట్‌ను స్తంభింపచేస్తున్నారు.” అని దుయ్యబట్టారు.