భాజపా అభ్యర్థిపై రాళ్లు: కాల్పుల్లో 4 గురికి గాయాలు
అహ్మదాబాద్: గుజరాత్‌లోని పంచ్‌మహల్ జిల్లాకు చెందిన భాజపా అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే జెతా భర్వాద్‌పైకి తార్సంగ్ గ్రామస్థులు రాళ్లు రువ్వారు. దాంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది కాల్పులు జరపగా నలుగురు గాయపడ్డారు. వారికి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే తలకు అయిన గాయాలకు చికిత్స పొందుతున్నారని, ప్రమాదం లేదని పోలీసులు తెలియజేశారు.