భాజపా వ్యతిరేఖశక్తుల్ని ఏకంగాచేస్తాం ` దీదీ


పనాజీ,అక్టోబరు 23(జనంసాక్షి):భాజపా వ్యతిరేకశక్తుల్ని ఏకంచేస్తామని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. వచ్చే ఏడాది గోవాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ పోటీలో నిలవనున్న విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రానికి 28వ తేదీన బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మమతా బెనర్జీ తన ట్విట్టర్‌లో ఓ విషయాన్ని పోస్టు చేసింది. భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీ విభజన రాజకీయాలను ఓడిరచేందుకు వ్యక్తులు, సంస్థలు, రాజకీయా పార్టీలన్నీ ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. గోవా ప్రజలు గత పదేళ్ల నుంచి ఎంతో వేదనకు గురైనట్లు ఆమె తన ట్వీట్‌లో తెలిపారు. గోవాకు 28వ తేదీన వెళ్తున్నాని, అందరూ ఏకమై బీజేపీని ఓడిరచాలని మమతా బెనర్జీ కోరారు. కలిసికట్టుగా గోవాలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్ర ప్రజల ఆశయాలను నిజం చేద్దామని దీదీ తన ట్వీట్‌లో తెలిపారు. గోవా అసెంబ్లీలో మొత్తం 40 సీట్లు ఉన్నాయి.