భారతదేశానికి జాతీయ క్రీడ అంటూ ఏదీ లేదు

న్యూఢిల్లీ: భారత్‌కు జాతీయ క్రీడ అంటూ ఏదీ లేదని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మొత్తం మీద మన దేశంలో ఇన్ని క్రీడలకు విస్తృత ప్రాచుర్యం, ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఫలానా క్రీడ భారతజాతీయ ఆట అని చెప్పదగినదేదీ లేదని పేర్కొంది. హాకీలో భారత్‌ ఒలింపిక్‌ స్వర్ణాలను కైవశం చేసుకున్నప్పటికీ. అది భారత్‌ జాతీయ ఆటకాలేదు. లక్నోకు చెందిన పదేళ్ల ఐశ్వర్య పరాశర్‌ ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయానికి సహ చట్టం కింద అభ్యర్థనను పంపింది. జాతీయగీతం, క్రీడ, జంతువు, పక్షి, పుష్పం, చిహ్నం.. కొన్నింటికి సంబంధించి చేసిన ప్రకటనల తాలూకు పత్రాల నకళ్లకోసం ఐశ్వర్య అభ్యర్థించింది. దీనికి కేంద్ర క్రీడల శాఖలో సహాయ కార్యదర్శిగా ఉన్న శివప్రతాప్‌సింగ్‌ తోమర్‌ స్పందిస్తూ ఇప్పటిదాకా ఏ క్రీడను కూడా జాతీయ క్రీడగా ప్రకించనే లేదని స్పష్టం చేశారు.