భారత్‌, పాక్‌ మధ్య కుదిరిన వీస ఒప్పందం

ఇస్లామాబాద్‌: భారత్‌, పాక్‌ల మధ్య ఉన్న వీసా నిబంధనలను సడలిస్తూ ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు భారత్‌ విదేశాంగశాఖ మంత్రి ఎన్‌.ఎం.కృష్ణ పాక్‌ విదేశాంగశాఖ మంత్రితో ఒప్పందం చేసుకున్నారు. వీసా నిబంధనల సడలింపు వల్ల సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని ఆ దేశ అంతర్గత వ్వవహారాల శాఖ మంత్రి రహమాన్‌ మాలిక్‌ అన్నారు.