భారత యువ క్రికెట్‌ జట్టుకు మాజీ క్రికెటర్‌ గంగూలీ అభినందన

హైదరాబాద్‌: అండర్‌-19 ప్రపంచకప్‌ సాధించిన భారత యువ క్రికెట్‌ జట్టుకు మాజీ క్రికెటర్‌ సౌరభ్‌ గంగూలీ అభినందించారు. హైదరాబాద్‌లో ఓ వాణిజ్య కార్యక్రమానికి హాజరైన గంగూలీ మీడియాతో మాట్లాడుతు ఈ విజయం దేశానికే ప్రత్యేకమైనదని, యువజట్టు క్రీడాకారులు ఆస్ట్రేలియాతో హోరాహోరిగా తలపడ్డారని గంగూలి అన్నారు. 2015 ప్రపంచకప్‌కి బలమైన క్రికెట్‌ జట్టు తయారు కాబోతోందని గంగూలి ఆకాంక్షించారు.