భారీ వర్షానికి కూలిన ప్రహారి గోడ..నలుగురి మృతి
హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా శనివారం తెల్లవారుజామున బాలానగర్ నర్సాపూర్ రహదారిలో పారిశ్రామిక వాడ ప్రహారిగోడ కూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనాస్థలిలో పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.