భీమిలీ తీరంలో అనుమానాస్పద వ్యక్తి కలకలం

విశాఖపట్నం : భీమిలీ సముద్ర తీరంలో అనుమానాస్పదంగా తిరుగుతూ ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. అతన్ని నేవీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విశాఖపట్నంలో ఉగ్రవాదులు బాంబు దాడులకు పాల్పడవచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ ఉదయం ఐఎస్‌ఎస్‌ కళింగ షిప్‌ వద్ద ఓవ్యక్తి అనుమానంగా తిరుగుతూ నేవీ భద్రతా సిబ్బందికి కనిపించాడు. దీంతో వాళ్లు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
పోలీసులు పట్టుకునే సమయంలో అనుమానితుడు తన సెల్‌ఫోన్‌ను సముద్రంలోకి విసిరేశాడు. దీంతో అతను ఉగ్రవాదేమోనని అనుమానిస్తున్నారు. అయితే, ఆ వ్యక్తి తనను వదిలివేస్తే కోటి రూపాయలు ఇస్తానని బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేసి ఉగ్రవాదం కోణంలో కేసును విచారణ చేపట్టారు.

తాజావార్తలు