భూపరిపాలన కమిషనర్‌ కార్యాలయంలో కూలినగోడ

హైదరాబాద్‌: నగరంలోని నాంపల్లి ప్రాంతంలో ఉన్న భూపరిపాలన కమిషనర్‌ కార్యాలయంలో ఒక గదిపై కప్పు, గోడ కూలిపోయాయి  మరమ్మతులు చేస్తుండగా అకస్మాత్తుగా ఇవి కూలిపోయాయి. ఆ సమయంలో కార్యాలయంలో విధినిర్వహణలో ఉన్న నలుగురు ఉద్యోగులను  అగ్నిమాపకదళ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.