భూములు కేటాయింపు కొనసాగితే సామాన్యులకు భూములు మిగలవు :మాణిక్యవరప్రసాద్‌

హైదరాబాద్‌: భూకేటాయింపులు పద్దతిలేకుండా కొనసాగితే రాష్ట్రంలో సామాన్యలకు భూములకు మిగలవని రాష్ట్రమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. వాన్‌పిక్‌కు 28వేల ఎకరాలు కేటాయించడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏ నౌకాశ్రయానికి ఇంతగా భూములను ఇవ్వలేదన్నారు. తనకు తెలిసి పెద్దనౌకశ్రయాలకు సైతం వేల ఎకరాలకు మించి కేటాయించలేదని ఆయన వెల్లడించారు. బాక్సైట్‌ను వెలికితీయడమంటే మన శరీరంలోని కిడ్నీలను అమ్ముకోవడమే అని ఆయన అన్నారు. బాక్సైట్‌ తవ్వకాలతో రాష్ట్రం ఎడారిగా మారే ప్రమాదముందన్నారు.