భోజన విరామానికి భారత్ స్కోరు 400/3
హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌లో భోజన విరామ సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 400 పరుగులు చేసింది. సచిన్ 3, కోహ్లీ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు పుజారా ద్విశతకాన్ని (204) నమోదు చేసి ఔటయ్యాడు. ఒక వికెట్ నష్టానికి 311 పరుగులతో మూడో రోజు ఆటను ఆరంభించిన టీం ఇండియా ఆసీన్‌పై 163 పరుగుల ఆధిక్యంలో ఉంది.