మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు

ఒంగోలు,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): జిల్లాలో తాగునీటి సమస్య  తలెత్తిందని, దీనిపై కార్యాచరణ చేస్తున్నామని
జిల్లా పరిషత్‌ అధ్యక్షులు ఈదర హరిబాబు అన్నారు. వేసవి నేపథ్యంలో తాగునీటి ఎద్దడి ఎలా ఎదుర్కొంటారనే విషయమై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. జిల్లాలో తాగునీటి సమస్యల నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీస్తున్నామని అన్నారు. మండలాల వారీగా చేతిపంపుల మరమ్మతులకునిధులు అందించామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సేద్యపు నీటిని అందించేందుకు పథకాలు అమలు చేస్తున్న క్రమంలో పొలాల్లో నీటికుంట, రైతు ఇంట్లో ఇంకుడు గుంత తవ్వుకుంటేనే పథకాల లబ్దిని అందించాలని సూచించారు. మండలాల పరిధిలో దీర్ఘకాలంగా, అపరిష్కృతంగా ఉన్న తాగునీటి పథకాలు వినియోగంలోకి తీసుకువస్తే కొంతమేరకు సమస్యలు తీరుతాయని అన్నారు. జిల్లాకు రానున్న ఎన్‌ఎస్‌పీ నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని, హరిబాబు చెప్పారు.