మంచిర్యాలలో ఏబీవీపీ సమావేశాలు

ఆదిలాబాద్‌, జూలై 13 : జిల్లాలోని మంచిర్యాల పట్టణంలో ఈ నెల 14,15వ తేదీలలో రెండురోజులపాటు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రశాంత్‌ తెలిపారు. ఈ సమావేశాలలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్రనాథ్‌తోపాటు కార్యదర్శి రంగారెడ్డి, ఇతర నాయకులు పాల్గొననున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యవర్గ సమావేశాలలో ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి, విద్యా రంగస్థితి, సమాచార హక్కు చట్టం అమలు తదితర అంశాలపై చర్చించి తీర్మానాలను ఆమోదించనున్నట్లు ఆయన తెలిపారు.