మంచి కథ దొరికితే నటిస్తా : జెనీలియా
హైదరాబాద్ : మంచి కథ దొరికినప్పుడు సినిమా చేయాడానికి తాను సిద్ధంగా ఉన్నానని బాలీవుడ్ నటి జెనీలియా తెలిపారు. ప్రస్తుతం సినిమా కథల అన్వేషణలో ఉన్నానన్నారు. సోమవారం ఆమె హైదరాబాద్‌లో మింత్రా కామ్ అనే
సరికొత్త స్టార్ ఆండ్ స్టైల్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. దీని ద్వారా 500 బ్రాండ్లకు చెందిన సుమారు 30వేల ఉత్పత్తులను ఎక్కడి నుంచి అయినా, ఏ సమయంలోనైనా పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ మార్కెటింగ్ వైస్ ప్రెసిండెంట్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు.



