మంటగలిసిన మానవత్వం వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి
గుంటూరు,నవంబర్21: మానవత్వం మంటగలిసింది. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. అయితే వీరు తమ కుటుబ సభ్యుల చేతిల్లోనే దుర్మరణం చెందడం విషాదకరం. గుంటూరు జిల్లాలోని నాదెండ్ల మండలం గురజవల్లిలో ఓ భార్య దారుణానికి పాల్పడింది. నిద్రిస్తున్న భర్త, రెండేళ్ల కుమారుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో కొడుకు మృతిచెందగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. మతిస్థిమితం లేనందునే ఆమె ఈ దారుణానికి పాల్పడిందని స్థానికులు చెప్తున్నారు. నాదెండ్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.కటుంబకలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కూనవరం మండలం పెద్దారకూరు గ్రామానికి చెందిన దంపతులు మంగళవారం అర్ధరాత్రి కుటుంబ కలహాల నేపథ్యంలో ఘర్షణకు దిగారు. అయితే గొడవను ఆపేందుకు అడ్డువచ్చిన మేనల్లుడు కత్తిపోట్లకు గురయ్యాడు. తమ కుమారిడిపై దాడి చేశారనే ఆగ్రహంతో చెల్లెలు అన్నపై దాడి చేసి చంపేసింది. ఈ ఘర్షణలో పలువురి



