మంతటి గ్రామంలో ఏర్పాటు చేసిన కంటివెలుగు
కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్య మరియు అరోగ్య శాఖ అధికారి డా.కె.సుధాకర్ లాల్
నాగర్ కర్నూల్ ఆర్సీ మార్చి 11(జనంసాక్షి):పెద్దముద్దునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మంతటి గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని అకస్మిక తనిఖీ చేసి లబ్దిదారులతో మాట్లాడి క్యాంపు రికార్డులని పరిశీలించిన జిల్లా వైద్య మరియు అరోగ్య శాఖ అధికారి డా.కె.సుధాకర్ లాల్.ఈ సంద్భంగా జిల్లా వైద్య మరియు అరోగ్య శాఖ అధికారి డా.కె.సుధాకర్ లాల్ మాట్లాడుతూ,కంటి వెలుగు కార్యక్రమ లక్ష్యాన్ని విజయవంతం చేయాలని,అలసత్వం ప్రదర్శించకుండా నిర్దేశించిన లక్ష్యం దిశగా పనిచేయాలని వైద్య సిబ్బందికి సూచించారు.వైద్య అదికరి డా.నారాయణ స్వామి,క్యాంపు వైద్య అధికారి,పర్యవేక్షణ అధికారి కేశవులు,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.