మంత్రాలయంలో రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న యడ్యూరప్ప

కర్నూలు: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామిని కార్ణటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప బుధవారం దర్శించుకున్నారు. మంత్రాలయం సమీపంలోని తుంగభద్ర రైల్వే స్టేషన్‌ వరకూ లైల్లో వచ్చిన యడ్యూరప్ప అక్కడి నుంచి రోడ్డు మార్గాన మంత్రాలయం చేరుకున్నారు. మఠం అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. యడ్యూరప్ప స్వామివారి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ  రాఘవేంద్రస్వామి ఆశీర్వాదం వల్లే సామాన్య కార్యకర్త నుంచి ఇంత స్థాయికి ఎదిగానన్నారు. తాను స్థాపించబోయే కొత్త పార్టీ నేపథ్యంలో స్వామివారి ఆశీర్వాదం కోసం దర్శనానికి వచ్చినట్లు తెలియజేశారు.  డిసెంబరు 9న స్థాపించబోయే కొత్త పార్టీలోకి తనతోపాటు 59మంది భాజపా ఎమ్మెల్యేలు చేరనున్నట్లు ప్రకటించారు. తనను ఇతర పార్టీలకంటే సొంత పార్టీ వారే ఎక్కువ ఇబ్బందులు పెట్టాటరన్నారు. దేశంలో జాతీయ పార్టీలకంటే ప్రాంతీయ పార్టీలు పలు రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయన్నారు.