మంత్రివర్గభేటీని అడ్డుకునేందుకు విద్యార్థుల యత్నం

హైదరాబాద్‌: వృత్తి విద్యా కళాశాలల్లో బోధనారుసుములపై ఈ రోజు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు విద్యార్థులు యత్నించారు, విద్యార్థిసంఘాల నేతలు డి బ్లాక్‌లోకి దూసుకుని వచ్చి సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకుని బలవంతంగా తరలించటం, వారు అందుకు ప్రతిఘటించటంతో ఉద్రిక్తత నెలకొంది.