మంత్రి ధర్మానకు మాతృవియోగం

శ్రీకాకుళం : రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖమంత్రి ధర్మాన ప్రసాదరావుకు మాతృవియోగం కలిగింది. ధర్మాన తల్లి సావిత్రమ్మ (79) రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హార్ట్‌ఎటాక్‌తో మరణించారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ధర్మాన తల్లి మృతి పట్ల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంతాపం తెలియజేశారు.