మంత్రి వ్యాఖ్యలు హీన రాజకీయాలకు నిదర్శనం:జేపీ

విశాఖపట్నం:ఐఏఎస్‌ అధికారులపై మంత్రి టీజీ వెంకటేశ్‌ వ్యాఖ్యలు క్షీణ,హీన రాజకీయాలకు నిదర్శమని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ అన్నారు.మంత్రి హోదాలో ఉంటూ శాసనసబలో తప్పుచేసే ఐఏఎస్‌లపై చర్చించి తగు చర్యలు తీసుకోవలసిన మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.తప్పును వేరొకరిపై నెట్టి తప్పించుకునే ధోరణి కన్పిస్తోందన్నారు. ఫార్మా పరిశ్రమలు జనావాసాలకు సమీపపంలో ఉండకూడదని సముద్ర తీరంలోనే నెలకొల్పాలని జయప్రకాశ్‌ నారాయణ పేర్కొన్నారు.సముద్ర తీరంలో ఆభివృద్ది పేరుతో పరిశ్రమలు నెలకొల్పి కాలుష్యాన్ని పెంచుతున్నారని,ఇది సమంజసం కాదని ఆయన అన్నారు.తొలి పార్లమెంటు సభ్యులు కందాళ సుబ్రహ్మణ్యం సన్మాన కార్యక్రమంలో పాల్గొనడానికి జేపీ విశాఖ వచ్చారు.