మంత్రులు రాజీనామాలు ఉపసంహరించుకున్నారు

బెంగళూరు:   కర్ణాటకలో రాజకీయ సంక్షోభం సమసిపోయింది. సీఎం సదానందగౌడను మార్చాలంటూ యడ్యూరప్ప వర్గీయులైన 9 మంది మంత్రులు తమ పదవులకు చేసిన రాజీనామాలను ఉపసంహరించుకున్నారు. అధిష్ఠానం హామి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి జగదీష్‌ షట్టర్‌ తెలియజేశారు. నాయకత్వ మార్పుపై అధిష్ఠానానికి ఎలాంటి గడువులు విధించలేదని చెప్పారు. సీఎం సదానంద నాయకత్వాన్ని ఎలాంటి గడువులు విధించలేదని  అన్నారు. సీఎం సదానంద నాయకత్వన్ని వ్యతిరేకిస్తూ యడ్యూరప్ప అనుకూల వర్గమైన 9 మంది మంత్రులు శుక్రవారం  తమ పదవులకు రాజీనామాలు చేసిన విషయం తెలిసింది.