మంత్రుల సాధికార బృందం అధ్యక్ష పదవికి పవార్‌ రాజీనామ

ఢిల్లీ : టెలికాం మంత్రుల సాధికారిక బృందం అధ్యక్ష పదవికి కేంద్ర మంత్రి శరద్‌ పవార్‌ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఈ రోజు మంత్రుల సాధికార బృందం తొలి సమావేశం నిర్వహించాల్సి ఉండగా, సమావేశాన్ని వాయిదా వేసిన పవార్‌ ప్రధానికి రాజీనామా లేఖ ఇచ్చారు. తనని ఈ అదనపు బాధ్యత నుంచి విముక్తుణ్ని చేయవలసిందిగా ఆయన లేఖలొ కోరారు.