మంథని పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన రామగుండం సిపి
జనంసాక్షి , మంథని : రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ మంథని పోలీస్ స్టేషన్ ను గురువారం రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్.,(డిఐజి), పెద్దపల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్ ఐపిఎస్., తో కలిసి సందర్శించి పోలీసుస్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది పనితీరు, నమోదయ్యే కేసుల వివరాలకు సంబంధించి అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల పనితీరు, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాధాల గురించి తీసుకుంటున్న నివారణ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని, పోలీసుస్టేషన్ నిర్వహణ, పోలీస్ స్టేషన్లలో 5ఎస్ ఇంప్లిమెంటేషన్, ఫంక్షనల్ వర్టీకాల్స్ గురించి కోర్ట్ డ్యూటీ , రిసెప్షన్ , పెట్రోల్ మొబైల్, టెక్ టీమ్స్ పనితీరు గురించి స్టేషన్ లోని సిబ్బంది తో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి సరిహద్దు ప్రాంతాల గురించి, ప్రజల సమస్యల గురించి,పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువ గా నమోదయ్యే కేసులు, వివరాలను అడిగి తెలుసుకొన్నారు. ప్రజలు అందించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత పోలీసులపై ఉందన్నారు. నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన పెంచాలని అన్నారు. అదే విధంగా గత వర్షాకాలంలో జరిగిన ఫ్లడ్ సమాచారం, జరిగిన నష్టం వివరాలు తెలుసుకొని భవిష్యత్తులో అట్టి విపత్తులను ఎదుర్కొనడానికి పోలీస్ తరుపున ప్లాన్ ఆఫ్ ఆక్షన్ తయారు చేయాలని సూచించారు. అధికారులతో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. గోదావరిఖని ఏసిపి గిరి ప్రసాద్, మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్, ఎస్ఐ సతీష్, ముత్తారం ఎస్సై రాములు పాల్గొన్నారు.