మందకృష్ణ దీక్ష భగ్నం

హైదరాబాద్‌: వికలాంగుల సమస్యలపై నాలుగు రోజులుగా హైదరాబాద్‌ మలక్‌ పేటలో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మందకృష్ణ ఆర్యోగం కీణీసుండటంతో పోలీసులు అయన్ను మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించారు. పోలీసుల చర్యను అడ్డుకునేందుకు ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు యత్నించారు. దీంతో పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.