మక్కా మసీదును సందర్శించిన మైనారిటీ మంత్రి: అహ్మదుల్లా

హైదరాబాద్‌: రంజాన్‌ మాసం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో మైనారిటీ శాఖ మంత్రి అహ్మదుల్లా ఈరోజు పాతబస్తీలోని చారిత్రక మక్కామసీదును సందర్శించారు. మసీదు అభివృద్దికోసం గత ఏడాది వచ్చిన వినతి  మేరకు కోటి రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ నిధులతో మక్కామసీదులో భూగర్భ నీటి ట్యాంకు, వాటర్‌ హౌజ్‌లో నీటి శుద్ది యంత్రాలు, వ్యాక్యూమ్‌ క్లీనర్స్‌ కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. మక్కామసీదుతో పాటు నాంపల్లిలోని షాహీ మసీదు అభివృద్ది కోసం 36లక్షలు విడుదల చేస్తామన్నారు. చార్మినార్‌ ఎమ్మేల్యే అహ్మద్‌ పాషా ఖాద్రి, జీహెచ్‌ఎంసీ స్పెషల్‌ మిట్టల్‌, ఇతర అధికారులు ఈ సందర్భంగా మంత్రితో పాటు పర్యటనలో పాల్గోన్నారు.