మట్టి గణపతే మహా గణపతి.

రుద్రూర్ (జనంసాక్షి):-
వినాయక ఉత్సవాలకు దేశం సిద్ధమవుతోంది. బుధవారం గణేశ్ చతుర్థి కావడంతో వినాయకుని మట్టి ప్రతిమలను పూజించి పర్యావరణ కాపాడే దిశగా రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద , కామధేను ఫుడ్ ఇండస్ట్రీస్ అధినేత బచ్చు రాము మరియు రుద్రూర్ మండల ఎస్సై రవీందర్ 131 మట్టి వినాయకలను గ్రామ ప్రజలకు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి గణపతే మహా గణపతి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బచ్చు రాము సెట్,
బచ్చు రమాదేవి, బచ్చు మౌనిక, ఎస్సై రవీందర్,
గ్రామ సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్ ,గ్రామ సెక్రటరీ విట్ఠల్ రెడ్డి, నగేష్, చిదుర వెంకటేశం గుప్తా,ఎముల గజేందర్, పంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్థులు పాలుగొన్నారు