మత్స్యకారుడు ఆలేటి శ్రీను కుటుంబానికి అండగామత్స్యకారుడు ఆలేటి శ్రీను కుటుంబానికి అండగా -ముదిరాజ్ మహాసభ సంఘం నాయకులు
కురవి మార్చి/19/ జనం సాక్షి న్యూస్:మహబూబాబాద్ జిల్లా కురవి మండలం స్టేషన్ గుండ్రాతి మడుగు గ్రామానికి చెందిన మత్స్య కార్మికుడు ఆలేటి శ్రీను గుండెపోటుతో మరణించగా ముదిరాజ్ మహాసభ కురవి మండల అధ్యక్షులు కట్ల కరుణాకర్ సమక్షంలో వారి భార్య ఆలేటి ఉమను మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి సహాయం అందించడం జరిగింది.ముదిరాజ్ మహాసభ తరఫున అందవలసిన భీమాను అందేలా కృషి చేస్తామని మరియు అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా మరియు మండల నాయకులు ఆవుల రాంబాబు, పేర్ల గణేష్, బసనబోయినన వెంకన్న, గుంటుక యాదగిరి, చిలుముల నాగేష్, కుంట శ్రీకాంత్, కుంట యాదగిరి, ఆలేటి శ్రీనివాస్, ఆలేటి అంజి తదితరులు పాల్గొన్నారు.