మద్యం దుకాణాల కేటాయింపుకు రీ నోటిఫికేషన్‌

ఆదిలాబాద్‌, జూన్‌ 30 : జిల్లాలో దరఖాస్తులు అందని మద్యం దుకాణాల కేటాయింపుకు ఎక్సైజ్‌ శాఖ అధికారులు మళ్లీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 7 మద్యం దుకాణాలకు గాను దరఖాస్తులను ఆహ్వానించగా ఇందులో 44 దుకాణాలకు ఏ ఒక్క దరఖాస్తు రాలేదు. ఈ 44 మద్యం దుకాణాల కేటాయింపునకు మళ్లీ దరఖాస్తుల కోసం జూలై 2వ తేదీవరకు సమయం కేటాయించారు. వీటిలో మంచిర్యాల ఎక్సైజ్‌ పరిధిలో 33, ఆదిలాబాద్‌ ఎక్సైజ్‌ పరిధిలో 11 దుకాణాలు ఉన్నాయి. నిర్మల్‌ 7, బైంసాలో 3, ఉత్నూరులో 1, ఆసీఫాబాద్‌లో 2, బెల్లంపల్లిలో 13, లక్కటిపేటలో 6, కాగజ్‌నగర్‌లో 1 దుకాణానికి గాను తిరిగి దరఖాస్తుల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆసక్తిగల వ్యాపారులు జూలై 2వ తేదీన సాయంత్రం 5 గంటలవరకు ఆదిలాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు జూలై 3వ తేదీన ఉదయం 10.30 గంటలకు వచ్చిన దరఖాస్తులలో లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు.