మద్యం విధానంపై పూర్తి వివరాలు పరిశీలించాకే తీర్పు

హైదరాబాద్‌:ప్రభుత్వం అములుచేస్తున్న నూతన మద్య విధానంపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.ప్రస్తుతం ఈ విధానాన్ని నిలిపి వేయాలంటూ దాఖలైన పిటిషిన్‌పై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయమని తేల్చి చెప్పింది.పూర్తి వివరాలను పరిశీలించాలకే తీర్పు వెల్లడిస్తామని పిటిషినర్లకు తెలిపింది.వేలం ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చేదని ప్రస్తుతం అమలు చేస్తున్న లాటరీ విదానం ద్వారా ఖజానకు గండిపడుతుందని ఇందులో ఒక్కరు మాత్రమే లబ్దిపొందుతారని మిగతావారు 25 వేల చొపున నష్టపొవాలల్సి వస్తొందని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.ప్రభుత్వం అమలు చేయనున్న విదానం పారదర్శకంగా ఉండాలని కోర్టుకు విన్నవించారు.పిటిషనర్‌ వాదనలు విన్న ధర్మాసనం స్పందిస్తూ గతంలో రెండేళ్లకోమారు నిర్వహించే మద్యం దుకాణాల కేటుయింపులో ఆర్థిక పరివుష్టి కలిగిన వ్యక్లులే దక్కించుకునేవారిని వ్యాఖ్యానించింది. చర్చించారు.