మద్యనిషేధం ఉండాలన్నదే నా విధానం:బొత్స

హైదరాబాద్‌:రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేదం విధించాలన్నదే తన విదానమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు.నిషేదం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడేదేమీ ఉండదనీ ఇతర ఆదాయ మార్గాలుంటాయని అన్నారు.గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.నిషేదమన్నది తన వ్యక్తిగత అభిప్రాయమైనా పార్టీ అధ్యక్షుడిగా దీనిపై అధిష్ఠానాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తానన్నారు.కేంద్ర అంగీకరిస్తే వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో అంశాన్ని పెడతామని తెలిపారు.గతంలో వ్యవసాయనికి ఉచిత విద్యుత్తు ఇస్తామనే అంశాన్ని మేనిఫెస్టోలో పెటేందుకు వైఎస్‌ అధిష్ఠానికి ఇక్కడి పరిస్థితుల్ని వివరించి అనుమతి తీసుకున్నారన్నారు.