మధ్య ప్రాచ్యానికి హిల్లరీ క్లింటన్
నాంఫెన్: గాజా సంక్షోభం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హిల్లరీ క్లింటన్‌ని తక్షణం మధ్య ప్రాచ్యానికి బయల్దేరి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. అధ్యక్షుడి తోపాటు ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గోంటున్న ఆమె అధ్యక్షుని ఆదేశానుసారం వెంటనే ప్రయాణమైనట్లు సమాచారం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో జెరూసలెంలో,రామల్లాలో పాలెస్తీనా నాయకులతో, కైరోలో ఈజిప్షియన్ నేతలతో హిల్లరీ చర్చలు జరుపుతారని వైట్ హౌస్ వర్గాలు ప్రకటించాయి.



