మనఊరు మనబడి పనులు తొందరగా పూర్తి చేయండి….
అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్..
చిలప్ చెడ్/సెప్టెంబర్ /జనంసాక్షి :- మండల పరిధిలోని అజ్జమర్రి, ఫైజాబాద్ గ్రామాల్లో అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ సందర్శించారు.ఈసందర్భంగా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ మన ఊరు మనబడిలో భాగంగా మండలంలోని ఆయా గ్రామాల్లో పాఠశాలలోని పనులను తొందరగా పూర్తి చేయాలని ఆమె అన్నారు. పనులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు పూర్తయిన పనుల వివరాలు పిఆర్ఏఈ మధుబాబును అడిగి తెలుసుకున్నారు. లైట్లు, ఫ్యాన్లు, సంపు ,కిటికీలు ,ఫ్లోరింగ్, పనులను చూశారు. పనులు వేగవంతం చేయాలని పనుల్లో తప్పనిసరిగా నాణ్యత పాటించి పనులను త్వరగతిగా పూర్తి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో మండల విద్యాధికారి బుచ్యనాయక్, పిఆర్ఏఈ మధుబాబు, సిఆర్పి రాజశేఖర్, సంఘ గౌడ్, కార్యదర్శులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.