మనగుడి సంబరాలకు సన్నాహాలు పూర్తి

శ్రీకాకుళం, జూలై 31 : రాష్ట్ర దేవాదాయశాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార పరిషత్తు సంయుక్త నిర్వహణలో జరపనున్న ‘మనగుడి’ సంబరాలకు సన్నాహాలు పూర్తి చేసినట్లు దేవాదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్‌ ఎ.వీరవెంకట సత్యనారాయణమూర్తి తెలిపారు. జిల్లాలో మూడు డివిజన్‌లలో దేవాదాయశాఖ పరిధిలో 279 ఆలయాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తించిన రామాలయాలు, షిరిడీసాయి మందిరాలు, శివబాలాజీ, గణపతి ఆలయాలు, హరిజనవాడలలో రామలయాల్లో మనగుడి సంబరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.