మరో 36 గంటలు వర్షాలు : జీహెచ్‌ఎంసీ కమీషనర్‌

మైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 36 గంటల్లో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జంట నగరాల్లోని అధికార్లందరు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు సూచించారు. నగరంలో వర్షం కారణంగా మృతి చెందిన కుటుంబాలకు రెవెన్యూ, పురపాలక శాఖ అధికార్లు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రెండేళ్ల కాలంలో జంటనగరాల్లో నమోదైన అత్యధిక వర్షాపాతం ఇదే నని కమిషనర్‌ పేర్కొన్నారు.