మర్లగూడెం అటవీ ప్రాంతంలో 144 సెక్షన్‌

పశ్చిమగోదావరి: జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం అటవీ ప్రాంతంలో ఆదివారం గిరిజనులు, అటవీ శాఖ సిబ్బంది మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అటవీ భూములు గిరిజనులు ఆక్రమించుకుంటున్నారని అటవీ సిబ్బంది మర్లగూడెంలో 144 సెక్షన్‌ విధించారు. ఈ నేపథ్యంలో గిరిజనుల, అటవీ సిబ్బంది ఘర్షణ జరిగింది.