మహనీయుల త్యాగాలను కొనియాడిన లోకాయుక్త

హైదరాబాద్‌: లోకాయుక్తలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నేడు ప్రజలు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ,  స్వాతంత్య్రాలు ఎందరో మహనీయుల త్యాగఫలి తమేనని లోకాయుక్త ఆనందరెడ్డి గుర్తిచేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలిగి దేశ కీర్తిని  పెంచాలని సూచించారు. సమాజంలో అవినీతిని నిర్మూలించడమే లక్ష్యంగా ఏర్పాటైన తమ సంస్థ శక్తి  వంచన లేకుండా ముందుకు సాగుతుందని చెప్పారు. దర్యాప్తు సిబ్బంది కొరత, పూర్తి స్థాయి అధికారాలు లేకపోవడం కారణంగా ఆశించిన లక్ష్యాన్ని  అందుకోలేకపోయామన్నారు. అయినప్పటికి సిబ్బంది చిత్తశుద్ధి, కార్య దీక్షతో ఎన్నో విజయాలు సాధించామని గుర్తుచేశారు.