మహాగణపతి కృప ప్రతి ఒక్కరిపై ఉండాలి… ఎంఎస్ భాస్కరరావు

కూకట్ పల్లి (జనంసాక్షి ): విఘ్నాలు తొలగించి శుభాలు కలిగేలా చూసే మహాగణపతి కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని ఎంఎస్ భాస్కర్ రావు అన్నారు.కూకట్ పల్లి వినాయక భక్త బృందం వారి గణపతి శోభాయాత్రలో శుక్రవారం ఏమ్ ఎస్ భాస్కర్ రావు,సీనియర్ జర్నలిస్ట్ తొట్ల పరమెష్ లు పాల్గొని గణపతిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని వినాయక మండపాల వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని పూజలు అన్నదాన కార్యక్రమాలతో మండపాలు కళకళలాడుతున్నాయన్నారు.