మహిళపై ఇద్దరు యువకుల ఆత్యాచారం

హైదరాబాద్‌: మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తుతున్నా అకృత్యాలు ఆగడం లేదు. ఇద్దరు యువకులు తనపై అత్యాచారం చేసినట్లు నగరంలోని అంబర్‌పేట పోలీసుస్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి కోసం గాలింపు  చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలియజేశారు.