మహిళా ఆరోగ్య కేంద్రం ప్రారంభించిన ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్
రుద్రూర్ (జనంసాక్షి); ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని రుద్రూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళ ఆరోగ్య కేంద్రాన్ని రుద్రుర్ ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్ ప్రారంభించి ఆరోగ్య మహిళ పోస్టర్ నీ ఆవిష్కరించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న 8 రకాల ఆరోగ్య సమస్యలను మహిళా ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందించబడుతుందని తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సరైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేందుకు సమగ్ర మహిళ ఆరోగ్య పథకం రూపొందించబడిందని. దీని ద్వారా సరైన స్కానింగ్ వైద్య పరీక్షలు వ్యాధి నిర్ధారణ చికిత్స మందుల పంపిణీ మరియు ఫాలోఅప్ సేవలు అన్ని వయసులో గల మహిళలకు 8 రకాల సర్వీస్ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అదేవిధంగా రుద్రూర్ మండలానికి మహిళా ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేయడం పట్లా హర్షం వ్యక్తం చేశారు. మెడికల్ ఆఫీసర్ ఆయేషా సిద్దిక మాట్లాడుతూ మహిళ ల శరీర బరువు నిర్వహణ, లైంగిక వ్యాధులు నిర్వహణ, మనోపాస్ నిర్వహణ ,టి సి డి ఓ కుటుంబ నియంత్రణ, నిర్వహణ మూత్ర నాలిక ఇన్ఫెక్షన్లు, సూక్ష్మ పోషక లోపాలు, క్యాన్సర్ స్క్రీనింగ్ డయాగ్నస్టిక్ వంటి వ్యాధులకు ప్రతి మంగళవారం రోజున మహిళా డాక్టర్ చే వైద్య సేవలు అందించే వెసులుబాటు రుద్రూర్ లో ఉంటుందనీ తెలియజేశారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని డిప్యూటీ డి ఎం & హెచ్ .ఓ డాక్టర్ విద్యా, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆయేషా సిద్దిఖ,మరియు మహిళా ఆరోగ్య సిబ్బందిని ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్ సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రుద్రుర్ జడ్పిటిసి నా రోజీ గంగారం ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్ రుద్రూర్ గ్రామ సర్పంచ్ ఇందూరు చంద్రశేఖర్ డిప్యూటీ డిఎం & హెచ్ ఓ డాక్టర్ విద్య మెడికల్ ఆఫీసర్ ఆయేషా సిద్ధిఖ సూపర్ వైజార్ లు రవి, సుమతి, సావిత్రి మరియు ఐసిడిఎస్ సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది,ఆశ వర్కర్లు,గ్రామస్తులు పాల్గొన్నారు.