మహిళ మృతదేహం వెలికితీత
తమిళనాడు : కరిగంబత్తూరులో ఈనెల 3న పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు వెలికితీశారు. పూడ్చిపెట్టిన ప్రదేశానికి 100 మీటర్ల దూరంలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహంపై వస్త్రాలు లేకపోవడంతో అత్యాచారం చేసి , అనంతరం పూడ్చిపెట్టారేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం కోసం రాయవేలూరు ఆసుపత్రి వద్ద మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు.