మహిళ మెడలోంచి గోలుసు చోరీ

మల్కాజ్‌గిరి: సఫిల్‌గూడ ఉద్యోగానికి వెళ్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గోలుసు చోరీ చేసిన సంఘటన నేరెడ్‌మెట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ కథనం ప్రకారం నేరెడ్‌మెట్‌కు చెందిన అమె రైల్వేలో పనిచేస్తోంది. ఉదయం పది గంటలకు ఇంటి నుంచి బస్సుకోసం నడుచుకుంటూ వస్తుండగా కార్లోవచ్చిన దుండగలు అమె మెడలో నుంచి రెండు తులాల బంగారు గోలుసు తెంపుకోని పరారయ్యారు. పోలిసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.