మాకు చీము నెత్తురు ఉంది.: కోమటిరెడ్డి

హైదరాబాద్‌: సీమాంధ్ర నేతలు తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్నారని మాజీ మంత్రి కోమటిరెడ్డి, వెంకటరెడ్డి అన్నారు. ఈ ఉదయం తెరాస అధినేత కేసీఆర్‌తో ఆయన భేటీ అయి భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వస్తుందన్నా తరుణంలో సీమాంధ్ర నేతల లాబీయింగ్‌ చేశారని ఆరోపించారు. మాకు చీము నెత్తురు ఉందని.. ఈ నెల 28లోపు కేంద్రం తెలంగాణ ప్రకటన చేయకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు.