మాఘపౌర్ణమికి ప్రత్యేక బస్సులు

విశాఖపట్టణం,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): మాఘపౌర్ణమి సందర్భంగా పూడిమడక సముద్ర స్నానాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని  ఏపీఎస్‌ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం కణితి వెంకటరావు అధికారులను ఆదేశించారు. 50 బస్సులను మాఘపౌర్ణమి తీర్థం సందర్భంగా సముద్ర స్నానాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సిద్ధం చేయాలన్నారు. అలాగే ఇతర వాహనాలు వెళ్లకుండా పోలీస్‌, రవాణాశాఖ అధికారులతో మాట్లాడాలన్నారు. ఆర్టీసీ బస్సులు సముద్ర తీరానికి సవిూపంలోకి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. దీనిపై విసృత స్థాయి ప్రచారం నిర్వహించాలన్నారు. అలాగే బస్సుపాసుల జారీ సులభతరం చేయాలన్నారు. ఆర్టీసీ పార్సిల్‌ సేవలపై వ్యాపారులకు వివరాలను అందజేయాలన్నారు. ఓఆర్‌ పెంచడంతోపాటు వ్యయాలను మరింత తగ్గించి, లాభాలను పెంచడానికి కృషి చేయాలని కోరారు.