మాచర్ల, ప్రత్తిపాడులో డిపాజిట్‌ కోల్పోయిన కాంగ్రెస్‌

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 18 స్థానాలకు గాను ఆ పార్టీ నరసాపురంలో గెలుపొంది. రామచంద్రాపురంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మాచర్ల, ప్రత్తిపాడులో ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ఇక్కడ కాంగ్రెస్‌ మూడో స్థానంతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది.