మాజీ కార్పొరేటర్ ముద్ర బోయిన శ్రీనివాస్ తో కలిసి మైత్రి నగర్ లో జరుగుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే_దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

share on facebook

ఎల్బీనగర్   ( జనం సాక్షి   )  మూసీ రివర్ ఫ్రoట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే_దేవిరెడ్డి_సుధీర్  రెడ్డి   లింగోజిగూడా డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ నందు జరుగుతున్న పనులను పరిశీలించారు., వరదనీరు  డ్రైన్స్ సమస్యల పరిష్కారం కోసం మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు   అధికారులు  కాలనీ వాసులచే కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనుల మీద అధికారుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వరదనీరు పోవడానికి వాటర్ డ్రైన్స్ వేయడం జరుగుతుంది అని అన్నారు. అట్టి పనుల్లో భాగంగా డ్రైన్స్ కూడా ద్వంసం కావడం జరిగింది. డ్రైన్స్ పగలడం వల్ల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  యుద్ధప్రాతిపదికన నూతన యూ.జీ.డి. పైప్ లైన్స్ , వాటర్ పైప్ లైన్స్ వ్యవస్థ ఏర్పాటు చేసి పరిస్థితులను పునరుద్ధరణ చేయాలని ఆదేశించారు. అలాగే కొన్ని వాటర్ ట్యాంకర్ల ద్వారా మంచినీరు కాలనీవాసులకు అందించాలని ఆదేశించారు. ఎత్తుపల్లాలను సరిగ్గా చూసుకొని పనులను వేగవంతం చేయాలని సూచించారు. కాలనీ వాసులు ఎవరు ఇబ్బందులు పడకుండా వారికి కనీస సౌకర్యాలు  కల్పించాలని ఆదేశించారు. ఇ కార్యక్రమంలో జీ.హెచ్.ఏం.సీ. డి.ఈ.కనకయ్య,వాటర్ వర్క్స్ డి.జీ.ఏం. సరిత, ఎల్.బి.నగర్ సర్కిల్ వాటర్ వర్క్స్ మేనేజర్ బలరాం రాజు, విజయ్ మరియు డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి,తిలక్ రావు,శ్రీకాంత్,శ్రీధర్,లక్ష్మారెడ్డి, మధుసూదన్ రెడ్డి,భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.