మాజీ సైన్యాధికారి వీకే సింగ్‌కు బెయిలు మంజూరు

న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో మాజీ సైనాధికారి వీకే సింగ్‌ ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు ఆయనతోపాటు మరో నలుగురు ఆర్మీ అధికారులు కోర్టుకు హాజరయ్యారు. రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ తేజేందర్‌సింగ్‌ వేసిన పరువునష్టం కేసులో వీరు కోర్టుకు హాజరమ్యారు. తాను పదవిలో ఉండగా లంచాలు తీసుకుని  కొన్ని కాంట్రాక్టులు ఇచ్చినట్లు మీడియాలోవారు తనపై దుష్ప్రచారం చేశారని ఆరోపిస్తూ తేజేందర్‌సింగ్‌ కేసు పెట్టారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న  5 గురు అధికారులకూ 20 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు బెయిలు మంజూరుచేసింది.