మామిడాలపల్లిలో వైభవంగా జరిగిన వెంకటేశ్వర కళ్యాణ మహోత్సము కార్యక్రమం

ముఖ్యఅతిథిగా
ఎమ్మెల్సీ.పాడి కౌశిక్ రెడ్డి

వీణవంక జనవరి 24 (జనం సాక్షి)వీణవంక మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో ముఖ్యఅతిథి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారు వెంకటేశ్వర కళ్యాణ మహోత్స కార్యక్రమానికి హాజరై కొలువై ఉన్న శ్రీ భూ నీళా-సమేత
వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు 11వ వార్షిక బ్రహ్మోత్సవముల సందర్భంగా ఈ రోజు 3 వ రోజు శ్రీ భూ-నీళా సమేత
వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరగగా
కరీంనగర్ వాస్తవ్యులు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమ శాస్త్ర పండితులు శ్రీమాన్ నమిలికొండ రమణాచార్య స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో అత్యంత బ్రహ్మాండంగా నిర్వహించబడింది, ముత్యాల తలంబ్రాలు మంగళవాయిద్యాలు వేదమంత్రాల మధ్య అంగ రంగ వేభవంగ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కళ్యాణం జరిగింది. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణము తిలకించారు, వివిధ గ్రామాల నుండి కూడా భక్తులు వచ్చి కళ్యాణము లో పాల్గొన్నారు,ఓడు బియ్యాలు మొక్కులు సమర్పించు కొన్నారు.. ఉదయం నిత్య ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు, సాయంత్రం పల్లకి సేవ, బండ్లు తిరుగుట కార్యక్రమం కలదు కలియుగ ప్రత్యక్ష దైవమైన
వెంకటేశ్వర స్వామి వారి కృప అందరి పై ఉండాలని కోరుచున్నాము, ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు. ఎంపీపీ మూసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి. జెడ్పిటిసి మాడ వనమాల సాదవ రెడ్డి. పిఎసిఎస్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి. స్థానిక సర్పంచ్ బండ సుజాత కిషన్ రెడ్డి. ఎంపీటీసీ మూల రజిత పుల్లారెడ్డి. ఆలయ వైస్ చైర్మన్ గాదె రమణారెడ్డి, ఆలయ అర్చక స్వామి. సంతోషచార్యులు,
నరసింహ స్వామి. ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పొదిల రమేష్. ఎలవేణి మల్లయ్య. మేకల సత్తిరెడ్డి తోపాటు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు