మారుతి సుజుకి నికర లాభంలో 22.84 శాతం తగ్గుదల

ఢిల్లీ: దేవంలో అత్యధికంగా కార్లను ఉత్పత్తిచేసే మారుతి సుజుకి ఇండియా ఈ రోజు తొలిత్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో కంపెనీ నికరలాభం 22.84 శాతం తగ్గి, రూ. 423.77 కోట్లు నమోదైంది. గత ఏడాది ఇది. రూ. 549, 23 కోట్లు  ఉండేది. కంపెనీ నకర అమ్మకాలు 27.53 శాతం పెరిగాయి. రూ.8,256.58 నుంచి 10,529.24 కోట్ల పెరిగాయి. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో మారుతి సుజుకి 2,95,896 వాహనాలను అమ్మింది.