మార్చ్‌కు అనుమతినివ్వండి: డీజీపీకి తెలుగుదేశం విజ్ఞప్తి

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కు అనుమతినివ్వాలంటూ తెలుగుదేశం తెలంగాణ ఫోరం నేతలు ఎర్రబెల్లి దయాకరరావు. మోత్కుపల్లి నరసింహులు డీజీపీ దినేశ్‌రెడ్డికి విజ్ఞాపన పత్రం అందించారు. శాంతియుతంగా ఈ కార్యక్రమం చేపడుతామంటే ఎందుకు అనుమతినివ్వలేదని వారు డీజీపీని ప్రశ్నించారు. అనంతరంవారు. విలేకరులతో మాట్లాడుతూ మార్చ్‌కు తెలుగుదేశం మద్దతు ప్రకటిస్తుందన్నారు.